SRD: పటాన్చెరువు రాముల వారి కళ్యాణ మహోత్సవ సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ చాటిన చిన్నారులకు పట్లోళ్ల అమర్ సేన్ రెడ్డి రూ. 25 వేల నగదు బహుమానం అందజేశారు. ఈ విషయాన్ని జిల్లా ట్రేడ్ యూనియన్ నాయకుడు కొల్కూరి నరసింహారెడ్డి వెల్లడించారు. చిన్నారి కళాకారులను ప్రోత్సహించేందుకు అమర్ సేన్ రెడ్డి ముందుకు రావడం అభినందనీయమని ఆయన కొనియాడారు.