అన్నమయ్య: సంబేపల్లె(మం) గుణ్ణికుంట్ల గ్రామంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై పార్టీ బలోపేతంపై చర్చించారు. అనంతరం కంటి శస్త్రచికిత్స చేయించుకున్న నాయకుడు శివారెడ్డిని పరామర్శించారు. అలాగే శ్రీరామనవమి సందర్భంగా దండువాండ్లపల్లె రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.