ప్రకాశం: టంగుటూరు సమీపంలో టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడిన విషయం తెలిసిందే. ఒంగోలులో ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఎస్సై నాగమల్లేశ్వరరావును మంత్రి స్వామి శుక్రవారం పరామర్శించారు. జరిగిన సంఘటనను అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో భాగంగా వారెంట్ ముద్దాయిని చేజ్ చేసే క్రమంలో కారు బోల్తా పడిందని తెలిపారు.