పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శాంతినగర్ శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు మున్సిపల్ ఛైర్మన్ నూగిల్ల మల్లయ్య, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యతో తరలివచ్చారు.