ASR: చింతపల్లి మండలంలో రహదారి ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా లైసెన్స్, రిజిస్ట్రేషన్, బీమా పత్రాలు వెంట ఉంచాలని ఎస్సై జి. వీరబాబు సూచించారు. అతివేగం వంటి ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.