AKP: వ్యాపారస్తులు ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లించాలని ఎస్ రాయవరం మండలం డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం తిమ్మాపురం, దార్లపూడి, కొరుప్రోలు తదితర గ్రామాల్లో షాపుల వద్దకు వెళ్లి ట్రేడ్ లైసెన్స్ ఫీజులు వసూలుచేసి రసీదులు అందజేశారు. ఈ నెలాఖరులోగా శత శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.