AP: మార్కాపురం దగ్గర బస్సు ప్రమాదంలో 14 మంది సజీవ దహనం కావడం బాధాకరమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు పూర్తిగా కోలుకుని ఇళ్లకు చేరేవరకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని భరోసా కల్పించారు. రోడ్లు వెడల్పు చేయడంతో వాహనాలు వేగంగా వెళ్తున్నాయని.. వాహనాల వేగాన్ని నియంత్రించాలని అధికారులకు సూచించారు.