MBNR: మహబూబ్ నగర్ రూరల్ మండలం ఓబ్లాయపల్లి తండాలో ఎంపీడీవో కరుణ శ్రీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు 15 ఇళ్లు మంజూరైనట్లు సర్పంచ్ రఘు నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని కోరారు. అనంతరం అక్కడ జరుగుతున్న ఉపాధి హామీ పనులను తనిఖీ చేశారు.