W.G: అరాచకాన్ని ఆదిలోనే ఆపాలని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. ఆయన భీమవరంలోని హాస్పిటల్ ఐసీయూ వార్డులో వైద్య సేవలు పొందుతున్న క్షత గాత్రులను శుక్రవారం సాయంత్రం పరామర్శించారు. ఒకరి తలలోని మేకును చూపెట్టారు. ఇంకో వ్యక్తి వీపుపై సుమారు పన్నెండు చాకు పోట్లుచూసి దిగ్బ్రాంత్రి వ్యక్తం చేశారు.