BHNG: అడ్డగూడూరు మండల పరిధిలోని ధర్మారం గ్రామం బిక్కెరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. SI వెంకట్ రెడ్డి వివరాలు.. మండల కేంద్రానికి చెందిన కృష్ణమూర్తి(48) విద్యుత్ శాఖలో లైన్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇవాళ ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తుండగా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.