టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ అనేక మంది తోడు కోసం, రొమాంటిక్ సంభాషణ కోసం AI ఆధారిత చాట్ బాట్లతో స్నేహం చేస్తున్నారు. ఈ క్రమంలో నేటి తరం యువత ఎక్కువగా నిమగ్నమవుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా జెన్ జీ ముందు వరుసలో ఉంది. ఈ ఏడాది మొదట్లో Joi AI అనే చాట్‌బాట్ యాప్ నిర్వహించిన సర్వేలో 83% మంది జెన్ జీ యువత AIతో భావోద్వేగ బంధాన్ని ఏర్పరచుకుంటున్నామని చెపుతున్నారు.