GDWL: అయిజ మండలం ఉత్తనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం పర్యావరణ విద్యలో భాగంగా విద్యార్థులు ఉత్సాహంగా సీడ్ బాల్స్ (విత్తన బంతులు) తయారు చేశారు. నేషనల్ గ్రీన్ కాప్స్ (NGC) టీచర్ వీరన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మట్టి, విత్తనాలు, పోషక పదార్థాల మిశ్రమంతో వీటిని రూపొందించారు. ప్రజలంతా కలిసి పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు.