NRPT: జిల్లాలో ప్రజలకు సరిపడా ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా పౌర సరఫరాల అధికారి బాలరాజు అన్నారు. బుధవారం జిల్లాలోని 44 పెట్రోల్ బంకులను తనిఖీ చేసినట్లు చెప్పారు. అన్నింట్లో పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉన్నాయన్నారు. అటు ఎల్పీజీ ఏజెన్సీలను కూడా తనిఖీ చేయగా జిల్లా ప్రజల అవసరాలకు సరిపోయే సిలిండర్లు ఉన్నాయని వెల్లడించారు.