MDCL: మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సూచనలతో గౌతమ్ నగర్ డివిజన్ హిల్ టాప్ కాలనీలో నిర్మించిన బస్తీ దవాఖాన భవనాన్ని డిప్యూటీ డీఎంహెచ్వో లావణ్య, బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. త్వరలోనే దవాఖానను ప్రారంభించి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.