మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉంది. అయితే, తాజాగా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ గాయపడటంతో షూటింగ్కు బ్రేక్ పడింది. ఈ కారణంగా సినిమా అనుకున్న సమయానికి విడుదలయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో మూవీ వాయిదా పడుతుందా అనే టెన్షన్ అభిమానుల్లో నెలకొంది.