NTR: తిరువూరులో పెట్రోల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని నాలుగు బంకుల్లో మూడు ఫ్యూయల్ లేక మూతపడ్డాయి. ఒక్క రిలయన్స్ బంక్లో మాత్రమే స్టాక్ ఉండడంతో ఆ బంక్ వద్ద భారీ క్యూ కనిపిస్తోంది. బంకులు మూసేస్తారన్న వదంతులతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. క్రెడిట్ నిలిపివేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని సమాచారం.