MDK: జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం వద్ద ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా కార్యక్రమం నిర్వహించారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా బుధవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిబ్బంది గ్రంథాలయ పరిసరాలను శుభ్రం చేస్తూ చెత్తాచెదారాన్ని తొలగించారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు.