NRML: మామడ మండలం పరిమండల్ మండల పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు గురుకుల ప్రవేశ ఫలితాల్లో ప్రతిభ కనబర్చినట్లు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. పాఠశాలకు చెందిన లౌహిక, ప్రావిణ్య, శ్రీనీథ్లు గురుకుల పాఠశాలలో సీటు సాధించడంతో బుధవారం ఉపాధ్యాయులు వీరిని అభినందించారు. తోటి విద్యార్థులు వీరిని ఆదర్శంగా తీసుకొని చదువులో రాణించాలన్నారు.