BDK: దుమ్ముగూడెం మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. తాజా కూరగాయలతో పౌష్టికాహారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. పాఠశాల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, అక్కడ ఉన్న నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు.