VKB: బొంరాస్పేట మండల కేంద్రంలో పాటు, తుంకిమెట్లలోని పెట్రోల్ బంకులకు బుధవారం ఉదయం వాహనదారులు భారీ సంఖ్యలో బారులు తీరారు. యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందని వదంతులతో పెద్ద పెద్ద క్యాన్లు తీసుకుని బంకుల దగ్గరకు వచ్చారు. పెట్రోల్ కొరత అపోహలు నమ్మవద్దని కొరత లేదని జిల్లా సివిల్ సప్లై అధికారి సుదర్శన్ తెలిపారు.