ప్రముఖ గేమింగ్ కంపెనీ ఎపిక్ గేమ్స్ తన సంస్థలో 1000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. సంస్థ రూపొందించిన ఫోర్ట్‌నైట్ గేమ్‌కు యూజర్ల ఆదరణ తగ్గడంతో ఆదాయం పడిపోయింది. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. ఆర్థిక ఒత్తిళ్లతోనే తొలగింపులు చేపట్టినట్లు సీఈవో టిమ్ స్వీనీ తెలిపారు. కంపెనీ సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తోందన్నారు.