SRD: గమ్మడిదల మండలం నల్లవెల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మిస్తున్న గృహాలను జిల్లా కలెక్టర్ శ్రీమతి పి.ప్రావీణ్య సందర్శించారు. ఇంటి నిర్మాణ నాణ్యతను స్వయంగా తనిఖీ చేసిన ఆమె, లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి బిల్లుల చెల్లింపులు, మౌలిక సదుపాయాల లభ్యతపై వివరాలు సేకరించారు. ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.