KNR: పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. పెన్షన్ వాలిడేషన్ యాక్ట్ 2005ను ఉప సంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జిల్లా కలెక్టర్ ద్వారా వినతిపత్రం సమర్పించారు.