MBNR: భూత్పూర్ మండలంలోని పెట్రోల్ బంకుల్లో రెండు రోజులుగా ఇంధన కొరత ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న బంకుల వద్ద పెట్రోల్, డీజిల్ కోసం ప్రజలు భారీగా క్యూ కట్టారు. నిల్వలు అయిపోతాయనే ఆందోళనతో వాహనదారులు బారులు తీరడంతో గందరగోళం నెలకొంది. త్వరలోనే సరఫరా పునరుద్ధరించాలని జనం కోరుతున్నారు.