KNR: ఇల్లందకుంట మండలం రాచపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు గురుకుల ప్రవేశ పరీక్షలో ప్రతిభ చాటారు. ముదురకోల శివరాణి, సిరిచందన హుజూరాబాద్‌లోని MJP బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో 5వ తరగతికి ఎంపికైనట్లు HM పల్లె రాములు తెలిపారు. గతేడాది కూడా నలుగురు విద్యార్థులు గురుకుల సీట్లు సాధించడం పాఠశాల ప్రతిష్ఠను పెంచిందన్నారు.