KMR: జిల్లాలో వరుసగా ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను ఏఎస్పీ చైతన్య రెడ్డి వెల్లడించారు. బిక్నూర్ పరిధిలో జరిగిన ఆలయ దొంగతనం కేసులో సీసీటీవీ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. నిందితుల నుంచి 2 బైక్లు, దేవత విగ్రహం, నగలు, CCTV కెమెరాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.