WGL: పట్టణ కేంద్రంలోని రైల్వే స్టేషన్లో ఈరోజు ఉదయం ఓ గుర్తు తెలియని మహిళ రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందింది. సికింద్రాబాద్ వెళ్తున్న ఆమె మణుగూరు ఎక్స్ప్రెస్ ఎక్కుతుండగా జారి పట్టాల పై పడి మృతి చెందినట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం MGM మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. మృతురాలిని గుర్తించినవారు WGL GRP పోలీసులను సంప్రదించాలన్నారు.