KRNL: ఆలూరు పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీ. ప్రవీణ్ కుమార్ ఏకగ్రీవంగా మంగళవారం ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షుడిగా లక్ష్మికాంత్, ఉపాధ్యక్షుడిగా ప్రసాద్ రావు, ప్రధాన కార్యదర్శిగా షాకీర్ బాషా, సహాయ కార్యదర్శిగా డీఐవీ విజయ్ రాజ్ ఎంపికయ్యారు. నూతన కమిటీ సభ్యులకు న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు.