TG: సీఎం రేవంత్ రెడ్డికి MLA దానం నాగేందర్ కృతజ్ఞతలు తెలిపారు. ‘మూసీ ప్రక్షాళన విషయంలో రేవంత్ రెడ్డిది దీర్ఘకాలిక ప్రణాళిక. దీనివల్ల నగరంతో పాటు చుట్టూరా ఉన్న జిల్లాల పరిధిలోనూ మేలు జరుగుతుంది. మూసీ ప్రక్షాళన వల్ల అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ఆలోచన చేసినందుకు సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు. హైదరాబాద్ విశ్వనగరంగా మారుతోంది’ అని అన్నారు.