E.G: కడియం మండలం పొట్టిలంక గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 147లో అక్రమంగా తరలిస్తున్న మట్టి లారీలను మండల వైసీపీ నాయకులతో కలిసి జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణు అడ్డుకున్నారు. అక్రమ మట్టి తరలింపుపై ఇప్పటివరకు నాయకులు నోరు మెదపకుండా ఉండటం చాలా ఆశ్చర్యమన్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.