డిజిటల్ పేమెంట్స్ మరింత సులభం కానున్నాయి. యూపీఐ పేమెంట్స్‌లో NPCI కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా బయోమెట్రిక్ సాయంతో డిజిటల్ చెల్లింపులు చేసే సదుపాయం కల్పించింది. ఫేస్ రికగ్నిషన్, ఫింగర్ ప్రింట్ సాయంతో రూ.5 వేల వరకు లావాదేవీలు చేసే సదుపాయాన్ని BHIMలో అందుబాటులోకి తెచ్చింది. రూ.5 వేలు పైబడితే మాత్రం పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.