SRPT: తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా కోదాడకు చెందిన రుద్ర నాగలక్ష్మి నియమితులయ్యారు. హైదరాబాద్లో రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీరమోహన్ ఆమెకు ఇవాళ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాగలక్ష్మి మాట్లాడుతూ.. చేనేత కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.