కడప: జిల్లాలో పలుచోట్ల ఇవాళ తెల్లవారుజామున పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎర్రగుంట్లలోని ప్రకాశ్ నగర్లో ప్రతి ఇంటిని పరిశీలించి పత్రాలు లేని 23 బైకులు, 2 ఆటోలను సీజ్ చేశారు. పులివెందులలో 60 మంది పోలీసులతో తనిఖీలు చేసి 45 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించారు.