MLG: వెంకటాపురం మండలం పాత్రపురం రైతు వేదికలో ఫర్టిలైజర్ డీలర్లతో వ్యవసాయ అధికారులు సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ సీజన్‌కు ఎరువుల నిల్వలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. డీలర్లు స్టాక్, విక్రయ వివరాలు రిజిస్టర్లలో పక్కాగా నమోదు చేయాలని ఆదేశించారు. కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు సకాలంలో ఎరువులు అందేలా సహకరించాలని తెలిపారు.