• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రెండవ రోజు కొనసాగిన ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’

NRML: నిర్మల్ పట్టణంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక రెండో రోజు కొనసాగింది. ఇందులో భాగంగా శనివారం అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ వైస్ ఛైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి 26, 28 వార్డుల్లో పర్యటించి పరిశుభ్రత, తాగునీటి పొదుపుపై అవగాహన కల్పించారు. కాలనీల సమస్యలను తెలుసుకుని అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

March 7, 2026 / 10:32 AM IST

చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో పల్లకి సేవ..!

NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో ఇవాళ భక్తులు పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేక పూలమాలలతో అలంకరించారు. నందవరం గ్రామంలో చౌడేశ్వరి దేవి అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపు చేశారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.

March 7, 2026 / 10:31 AM IST

ప్రజా పాలనతో సమస్యలు పరిష్కారం: సర్పంచ్

BDK: ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ ద్వారా గ్రామ సమస్యలు పరిష్కారమవుతాయని పినపాక సర్పంచ్ అలివేలు అన్నారు. పినపాకలో గ్రామస్థులతో మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా, నిత్యం వచ్చే పంచాయతీ ట్రాక్టరులోనే వేయాలని కోరారు. మన పరిసరాలను మనమే శుభ్రం చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు.

March 7, 2026 / 10:31 AM IST

అరబెట్టిన మిర్చి చోరీ.. కేసు నమోదు

HNK: పరకాల మండలం మల్లక్కపేటగ్రామ శివారులో మిర్చి చోరీ ఘటన కలకలం రేపింది. రైతు దొమ్మటి బాబు బావి వద్ద అరబెట్టిన సుమారు 5 క్వింటాళ్ల మిర్చిని గుర్తు తెలియని దొంగలు అపహరించారు. చోరీకి గురైన మిర్చి విలువ లక్ష రూపాయలకు పైగా ఉంటుందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ క్రాంతి కుమార్ తెలిపారు.

March 7, 2026 / 10:31 AM IST

బాలయ్య కొత్త మూవీపై UPDATE

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీ సిద్ధమవుతోంది. ముంబై నేపథ్యంలో సాగే ఈ మూవీలో బాలయ్య గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారట. ప్రస్తుతం HYDలోని ప్రత్యేక సెట్‌లో రాత్రిపూట కీలక యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ షెడ్యూల్ మరో 2 వారాలు సాగనున్నట్లు టాక్.

March 7, 2026 / 10:31 AM IST

పాలిటిక్స్‌లోకి త్రిష ఎంట్రీ ఖాయమా?

ఇటీవల చెన్నైలో ఓ వివాహ రిసెప్షన్‌లో విజయ్, త్రిష జంటగా కనిపించి సందడి చేశారు. వీరిద్దరూ ఒకే కారులో, మ్యాచింగ్ దుస్తుల్లో రావడం చర్చకు దారితీసింది. ఇదే సమయంలో త్రిష రాజకీయ అరంగేట్రంపై ప్రచారం ఊపందుకుంది. ఆమె విజయ్ ‘TVK’ పార్టీలో చేరి, చెన్నై నుంచి MLAగా పోటీ చేస్తారని తెలుస్తోంది. 15 ఏళ్ల క్రితమే తనకు CM అవ్వాలని ఉందన్న త్రిష వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

March 7, 2026 / 10:31 AM IST

ట్రాఫిక్‌లో ఇరుక్కున్న అంబులెన్స్

NLR: బుచ్చి పట్టణంలో ట్రాఫిక్ సమస్య రానురాను జఠి లంగా మారుతుంది. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ట్రాఫిక్‌లో అంబులెన్స్ చిక్కుకుంది. గమనించిన స్థానిక యువకులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి అంబులెన్స్‌కు దారిచ్చారు. ప్రతిరోజు ట్రాఫిక్ సమస్యతో సతమవుతమవుతున్నామని పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, వివిధ పనుల నిమిత్తం వెళ్లే వాహనదారులు వాపోతున్నారు.

March 7, 2026 / 10:30 AM IST

ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్, మేయర్

NZB: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి కార్యక్రమానికి సంబంధించి అవగాహన ర్యాలీని శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి NZB మేయర్ ఉమారాణితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

March 7, 2026 / 10:30 AM IST

‘మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం’

SRCL: మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో మహిళ సంఘ భవన నిర్మాణానికి శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళ సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. సర్పంచ్ చిలుక మల్లేశ్వరి, ఎంపీడీవో రాధా పాల్గొన్నారు.

March 7, 2026 / 10:30 AM IST

ప్రజాపాలనలో ‘భర్తల’ పెత్తనం?

TG: రాష్ట్రంలో ఇటీవల సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలలో కొన్ని చోట్ల మహిళలు ఎన్నికయ్యారు. అయితే ఆ స్థానంలో వారి భర్తలు పెత్తనం చెలాయిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. వీటిని అధికారులూ చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఆర్మూరులో అయితే ఏకంగా మహిళా కౌన్సిలర్ల స్థానంలో వారి భర్తలే ప్రమాణ స్వీకారం చేయడం చర్చనీయాంశంగా మారింది.

March 7, 2026 / 10:24 AM IST

మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో శుభ్రత.!

MDK: ప్రభుత్వం ప్రారంభించిన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో శుభ్రత, పరిశుభ్రత పనులు చేపట్టారు. మెదక్ రూరల్ ఎస్సై లింగం, తోటి సిబ్బంది పోలీస్ స్టేషన్ పరిసరాలను శుభ్రపరిచారు. ప్రభుత్వ సూచన మేరకు ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలను శుభ్రం చేస్తున్నారు.

March 7, 2026 / 10:23 AM IST

కార్టెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు

VZM: బొబ్బిలిలోని స్థానిక మల్లమ్మపేటలో ఇవాళ ఉదయం పోలీసులు కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఇద్దరు CIలు, ఏడుగురు SIలతో సహా 51మంది పోలీసులు ఇంటింటికి వెళ్లి సోదాలు నిర్వహించారు. అలాగే అనుమతి పత్రాలు లేని పలు వాహనాలను సీజ్‌ చేశారు. అనంతరం CI నారాయణరావు మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలు నివారణలో భాగంగా కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించినట్లు తెలిపారు.

March 7, 2026 / 10:22 AM IST

జోగులాంబను దర్శించుకున్న మాజీ గవర్నర్ సతీమణి

GDWL: అలంపూర్‌లో వెలిసిన జోగులాంబ దేవి బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను శనివారం తెలంగాణ మాజీ గవర్నర్, ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సతీమణి సుధాదేవ్ వర్మ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఉభయ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం శేష వస్త్రంతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

March 7, 2026 / 10:21 AM IST

కార్డెన్ సెర్చ్‌లో పోలీసులపై కాల్పులు

AP: విజయవాడలో బుల్లెట్లు కలకలం సృష్టించాయి. బాలాజీ హోటల్‌లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. దుండగుడు వారిపై కాల్పులకు ప్రయత్నించాడు. అయితే ట్రిగర్ లాక్ కావడంతో.. బుల్లెట్ బయటకు రాలేదు. అప్రమత్తమై దుండగుడిని పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి 9ఎంఎం పిస్టల్, ఐదు రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. 

March 7, 2026 / 10:21 AM IST

రేపు అనంతలో క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు

ATP: ఉమ్మడి జిల్లా సీనియర్స్ అండర్- 23 పురుషుల క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు ఈనెల 8వ తేదీన అనంతపురంలోని ఆర్డిటి స్టేడియంలో నిర్వహిస్తామని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి యుగేందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటలకు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార కార్డు, క్రీడా సామాగ్రితో క్రీడాకారులు హాజరు కావాలని సూచించారు.

March 7, 2026 / 10:20 AM IST