CTR: పుంగనూరులో ఈనెల 14న ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ బాషా తెలిపారు. ఏటా రంజాన్ మాసంలో పట్టణంలోని 28 మసీదులకు చెందిన ముస్లిం సోదరులకు వారి సహకారంతో ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు తెలిపారు.
మహబూబ్ నగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సర్వసభ్య సమావేశం ఆదివారం సుభాష్ నగరంలోని వైశ్య వసతి గృహంలో ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు సీఈవో రాజేంద్ర కుమార్ తెలిపారు. పాలకవర్గ సభ్యులు, వాటాదారులు అందరూ హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ భేటీలో బ్యాంక్ వ్యాపార, అభివృద్ధి అంశాలపై చర్చ జరగనుంది.
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పరమహంస యోగానంద వర్ధంతి నేడు. పశ్చిమ దేశాలకు యోగా, ధ్యానాన్ని పరిచయం చేసి ‘ఫాదర్ ఆఫ్ యోగా ఇన్ ది వెస్ట్’గా ఆయన పేరుగాంచారు. ఆయన రచించిన ‘ఒక యోగి ఆత్మకథ’ ప్రపంచవ్యాప్త ఆధ్యాత్మిక గ్రంథంగా నిలిచింది. క్రియాయోగ విద్యను విశ్వవ్యాప్తం చేసిన ఆయన, 1952 మార్చి 7న తుదిశ్వాస విడిచారు. ఆయన బోధనలు నేటికీ కోట్లాది మందికి స్ఫూర్తినిస్తున్నాయి.
MDCL: ఉప్పల్ పరిసరాల్లో కాలువ పనులు కొనసాగుతుండటంతో ఆంజనేయ నగర్, శ్రీనగర్, సెవెన్ హిల్స్ కాలనీ ప్రాంతాల్లో దోమల సమస్య తీవ్రంగా మారింది. తవ్విన కాలువల్లో నిల్వ నీరు ఉండటం వల్ల దోమలు విపరీతంగా పెరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. సాయంత్రం వేళ బయటికి రావడానికే భయపడుతున్నామని వాపోతున్నారు. వెంటనే ఫాగింగ్, శుభ్రత చర్యలు చేపట్టాలన్నారు.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,510 పెరిగి రూ.1,63,640కి చేరింది. అలాగే, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.2,300 పెరిగి రూ.1,50,000 మార్కును తాకింది. వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా కిలో రూ.2,90,000 వద్దే కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
KRNL: ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న శేఖర్ (55) శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. రా. 8 గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. 1997 నుంచి 29 ఏళ్ల పాటు సంస్థకు విశేష సేవలు అందించిన శేఖర్, ఉత్తమ డ్రైవర్‌గా పలు అవార్డులు అందుకున్నారు.
బాపట్ల పురపాలక సంఘ పరిధిలోని పలు వార్డుల్లో మున్సిపల్ కమిషనర్ జి. రఘునాధ రెడ్డి పర్యటించారు. 3వ వార్డు రైలుపేటలో జరుగుతున్న డ్రైనేజ్ పూడికతీత పనులను పరిశీలించి పనులు వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని శానిటరీ ఇన్‌స్పెక్టర్ నజీర్‌కు సూచించారు. అనంతరం అన్న క్యాంటీన్‌ను సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు.
కోనసీమ: ఆత్రేయపురం మండలం పులిదిండి గ్రామానికి చెందిన కనుమూరి సీతారామరాజు(40) మద్యానికి బానిసయ్యా డు. శుక్రవారం మద్యం మత్తులో ఉండి పురు గులు మందు తాగాడు. దీంతో కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆసుపత్రి నుంచి వచ్చిన స మాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ఎస్.రాము తెలిపారు.
సత్యసాయి: హిందూపురం మోడల్ కాలనీలో శనివారం భారీ తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ మహేష్ నేతృత్వంలో 40 మంది పోలీసు సిబ్బంది ప్రతి ఇంటిని సోదా చేసి రౌడీ షీటర్లపై నిఘా పెట్టారు. సరైన రికార్డులు లేని 55 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
KNR: శంకరపట్నం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి నుంచి 10వ తరగతి అడ్మిషన్ల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఈనెల 10వ తేదీ నుంచి స్వీకరించనున్నట్లు ప్రిన్సిపల్ ప్రభాకర్ తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు https://www.tgms .telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
NRML: 2003 డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్ వద్ద నిర్వహిస్తున్న మహా విజ్ఞాపన ధర్నాకు శనివారం నిర్మల్ నుంచి ఉపాధ్యాయులు బయలుదేరారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 57/4, 57/5 మెమోలను అమలు చేసి తమకు పాత పెన్షన్ కల్పించాలని వారు కోరారు.
MHBD: బయ్యారం మేజర్ గ్రామపంచాయతీలోని హనుమంతుని గడ్డ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు రామగిరి వెంకన్న శనివారం అనారోగ్యానికి గురై మరణించారు. ఈ విషయం తెలుసుకున్న MHBD పార్లమెంట్ లీగల్ అడ్వైజర్ గుగులోత్ కిషన్ నాయక్, బయ్యారం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని శ్రీనివాస్ రెడ్డి మృతుడి నివాసానికి వెళ్లి ఆయన పార్దివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
E.G: రాజమండ్రి రూరల్ మండల ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలోని TIDCO గృహాల వద్ద శనివారం ఉదయం మెగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సౌత్ జోన్ DSP భవ్య కిషోర్ పర్యవేక్షణలో జరిగింది. ఈ తనిఖీలో సరైన పత్రాలు లేని 25 వాహనాలను గుర్తించి సీజ్ చేశారు. మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా & సంబంధిత నేరాలను అరికట్టడమే లక్ష్యంగా తనిఖీ చేపట్టారు.
ADB: ఆదిలాబాద్‌లో ఎయిర్ పోర్టు మ్యాప్ పై క్లారిటీగా రానున్న అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల ప్రజలు కోరారు. నేరడిగొండలో ఎమ్మెల్యేను కలిసి విన్నవించారు. దీంతో ఎమ్మెల్యే సానుకులంగా స్పందిస్తూ రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో రైతులు, ఇండ్లు, ప్లాట్లు బాధితుల సమస్యలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలన్నారు.
కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో కొత్తగా చేపడుతున్న డ్రైనేజ్ నిర్మాణ పనులను పట్టణ టీడీపీ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ శనివారం పరిశీలించారు. పనుల పురోగతిని తెలుసుకొని నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.