వరంగల్ జిల్లాలో ఈనెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 288 పాఠశాలల నుంచి 9,492 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారన్నారు. ఇందులో 4,932 మంది బాలురు, 4,560 మంది బాలికలు ఉన్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల కోసం 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు.
PDPL: బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం పార్లమెంటులో పోరాడాలని జిల్లా ఎంపీ వంశీకృష్ణకు జిల్లా బీసీ జేఏసీ వైస్ ఛైర్మన్ కొండి సతీష్ వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు ఆయన నిన్న హైదరాబాదులో ఎంపీని కలిశారు. ఈనెల 16 నుంచి జరిగే సమావేశాలలో 42% బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని కోరారు.
మొదటిసారి లైంగిక అనుభవాన్ని పొందే వయసు విషయంలో దేశాల మధ్య భారీ వ్యత్యాసాలు ఉన్నట్లుగా ‘డ్యూరెక్స్’ సర్వే స్పష్టం చేసింది. ఈ జాబితాలో ఆసియా దేశాలు అత్యధిక వయసుతో మొదటి వరుసలో ఉండగా, ఐరోపా దేశాలు అతి తక్కువ వయసుతో చివరి వరుసలో ఉన్నాయి. భారత్‌లో సగటున 22.9 ఏళ్ల వయసులో, అమెరికాలో 18 ఏళ్లు, ఐలాండ్‌లో 15.6 ఏళ్లలో యువత మొదటి సెక్స్ అనుభవం పొందుతున్నారట.
JGL: జగిత్యాల మండలం హన్మాజీపేట గ్రామానికి చెందిన పూదరి మల్లేశం-గంగాలక్ష్మీ దంపతుల కుమారుడు రాహుల్ సివిల్స్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచాడు. శుక్రవారం విడుదలైన ఫలితాల్లో ఆయన 748వ ర్యాంక్ సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు. గ్రామస్థులు, స్నేహితులు, బంధువులు ఆయన తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.
MDK: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ సిబ్బందికి అవగాహన కల్పించారు. మెదక్‌లో పోలీస్ పరేడ్ పరిశీలించి గౌరవ వందనం స్వీకరించారు. పోలీసు విధుల్లో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దన్నారు. పోలీసు సిబ్బందికి క్రమశిక్షణ, శారీరక దృఢత్వంపై పలు సూచనలు చేశారు. పరేడ్ నిర్వహించడం వల్ల క్రమశిక్షణ పెరుగుతుందన్నారు.
విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబోతో దర్శకుడు అనిల్ రావిపూడి ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో వెంకీ సరసన కీర్తి సురేష్ నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమె ఈ ప్రాజెక్టుపై సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తుండగా.. 2027 సంక్రాంతికి విడుదల కానుంది.
VZM: సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో గంట్యాడ మండలం కొర్లాం గ్రామానికి చెందిన ప్రమోద్ విష్ణు సత్తా చాటారు. UPSC ఫలితాల్లో ఆయన జాతీయ స్థాయిలో 640వ ర్యాంకు సాధించి IRSకు ఎంపికయ్యారు. తొలి ప్రయత్నంలో విఫలమైనా రెండో ప్రయత్నంలో విజయం సాధించారు. తండ్రి శ్రీనివాసరావు ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు.
GDWL: ఉండవెల్లిలో శుక్రవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో చిన్న రాముడు, పెద్ద రాముడు, నాగమద్దిలేటి, శ్రీరాములు అనే రైతులకు చెందిన 5 గడ్డివాములు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. సుమారు రూ.3 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.
W.G: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘ఆటవిడుపు’ పేరుతో శుక్రవారం రాత్రి విజయవాడలో నిర్వహించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల క్రీడా సాంస్కృతిక ఉత్సవాలు-2026 విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ‘భీముని ఏకపాత్రాభినయం’ ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో స్వర్గీయ నందమూరి తారక రామారావు ‘పాండవ వనవాసం’ చిత్రంలోని డైలాగ్ చెప్పడంతో అంత ఆశ్చర్యానికి గురైయ్య...
VSP: ఆరిలోవ శ్రీకాంత్ నగర్‌లో ఏసీపీ అనేపు నరసింహమూర్తి ఆధ్వర్యంలో సీఐ మల్లేశ్వరరావు మరో 35 మంది పోలీస్ సిబ్బంది 230 ఇళ్లను విస్తృతంగా తనిఖీలు చేశారు. ఇవాళ తెల్లవారుజాము నుంచే జరిగిన ఈ తనిఖీల్లో రికార్డు లేని 14 బైకులను, రెండు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. సీపీ సూచనలతో తనిఖీలు చేశామని సీఐ తెలిపారు.
SRPT: అనంతగిరి మండలం చనుపల్లి నుంచి కోదాడకి వెళ్లేందుకు బస్సు సౌకర్యం లేక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 13 కిలోమీటర్లు ప్రయాణించాల్సి రావడంతో ఆటోల్లో వెళ్లాల్సి వస్తుంది. దీంతో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.
SRD: ముత్తంగి శివారులో NH-65 వద్ద పోలీసులు గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఒడిశా నుంచి ముంబైకు DCM వాహనంలో 6 కేజీల ఎండు గంజాయి తరలిస్తుండగా SI ఆసిఫ్ బృందం పట్టుకుంది. నిందితుల నుంచి గంజాయి, DCM వాహనం, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.13.30 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం కాగా కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
CTR: పూతలపట్టు మండలంలో మాదకద్రవ్యాల నిర్మూలనకు సీఐ గోపి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా బండపల్లి, ముత్తిరేవుల పరిసర ప్రాంతాల్లో ఇవాళ తనిఖీలు చేశారు. అనుమానిత ప్రాంతాలు, పాత నేరస్తుల ఇళ్లను పరిశీలించారు. డ్రగ్స్ వాడకానికి వ్యతిరేకంగా ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.
KRNL: కృష్ణమ్మ ఒడి నుంచి క్రమంగా సంగమేశ్వరం గర్భాలయం బయటపడుతోంది. గతేడాది జూన్ 27న గర్భాలయం పూర్తి కృష్ణమ్మ ఒడిలో జలాధివాసమయ్యింది. తిరిగి కృష్ణాజలాలు తగ్గుముఖం పట్టడంతో శుక్రవారం శిఖరభాగం నుంచి 11 అడుగుల మేర బయటపడింది. రెండు వారాల సమయంలో పూర్తి ఆలయం బయట పడే అవకాశముందని పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ తెలిపారు.
SRCL: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ అన్నదాన ట్రస్టుకు ఓ భక్తుడు రూ.2లక్షలు విరాళం శుక్రవారం అందజేశారు. హైదరాబాద్‌లోని కోకాపేట్‌కు చెందిన బొమ్మవేణి సౌజన్య -రాజేశ్వర్ రెడ్డి దంపతులు రూ.2లక్షలు విరాళం అందించగా, అన్నప్రసాదానికి రూ.1.82లక్షలు, శాశ్వత అభిషేకానికి రూ.18వేలు సమర్పించారు. ఈ మొత్తాన్ని ప్రొటోకాల్ పర్యవేక్షకులు శ్రీనివాస్‌కు అందజేశారు.