KMM: వన్యప్రాణి సంరక్షణలో విశేష సేవలందిస్తున్న బీట్ ఆఫీసర్ భూక్యా కల్పన రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ గౌరవం దక్కింది. కామేపల్లి మండలం జోగ్గూడెంకు చెందిన కల్పన ప్రస్తుతం మల్లారం బీట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తూనే లా కోర్స్ చదువుతున్నారు. 2012లో విధుల్లో చేరిన ఆమె, అటవీ సంరక్షణలో నిరంతరం శ్రమిస్తున్నారు.
VSP: మూడుసార్లు విఫలమైనా నిరుత్సాహపడకుండా పట్టుదలతో ప్రయత్నించిన జిల్లాకు చెందిన గుమ్మల శ్వేత సివిల్స్ పరీక్షలో 573వ ర్యాంకు సాధించారు. నగరంలోని కణితి అంబేడ్కర్ కాలనీకి చెందిన ఆమె స్వస్థలం అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం మేడిచర్ల గ్రామం. తండ్రి రాజబాబు విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉద్యోగి కాగా, తల్లి విజయలక్ష్మి గృహిణి. ఈ మేరకు తల్లితండ్రులు సంతోషం వ్యక్తం చేసారు.
ప్రకాశం: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం కొండపి పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సందర్శించిన విద్యార్థినిలకు పోలీస్ అధికారులు పోలీస్ స్టేషన్లో నిర్వహించే విధులు, మహిళా సహాయ కేంద్రం సేవలు, పోలీసుల పనితీరు గురించి వివరించారు. అనంతరం కొత్త చట్టాలపై అవగాహన కల్పించారు.
SRPT: నడిగూడెం మండల వ్యాప్తంగా దట్టమైన పొగమంచు కురిసింది. కనీసం 5 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొనడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రహదారిపై ప్రయాణం కష్టతరంగా మారడంతో వాహనదారులు హెడ్‌లైట్లు ఆన్ చేసి, అత్యంత నెమ్మదిగా ప్రయాణించారు. పొగమంచు కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
NTR: ఇబ్రహీంపట్నం మండలం కిలేశపురంలో పీఎంఎఫ్‌ఎంఈ పథకం ద్వారా ఉమ ఏర్పాటు చేసిన ఎద్దు గానుగ యూనిట్‌ను కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం ప్రారంభించారు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక స్వావలంబన సాధిస్తే కుటుంబం, సమాజం బలోపేతం అవుతుందని తెలిపారు. అనంతరం కలెక్టర్ నీతి ఆయోగ్ అధికారి ములేతో కలిసి ఆకాంక్షిత మండలాల్లో అభియాన్ 2.0 కార్యక్రమాన్ని పరిశీలించారు.
KMR: గతంలో గ్రామ పంచాయతీలలో చేపట్టిన పనులకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కామారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి మురళీ ఆదేశించారు. ఇటీవల గ్రామ పంచాయతీలకు 15 ఆర్థిక సంఘం నిధులు ప్రభుత్వం విడుదల చేసిందని గుర్తు చేశారు. ఆ నిధులను గతంలో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు తక్షణమే పంచాయతీ సెక్రటరీలు చెల్లించాలని సూచించారు.
W.G: నరసాపురం పట్టణం రాయిపేటలోని శ్రీ చక్ర సహిత శ్రీ పుంతలో ముసలమ్మ అమ్మవారి ఆలయ జాతర మహోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. శనివారం అమ్మవారికి విశేష అభిషేకాలు, శాంతి హోమం, 8న అమ్మవారిని నిలబెట్టుట, 21న సారె సమర్పణ, 22వ తేదీన ఆదివారం నిప్పుల గుండం, అమ్మవారి జాతర, 27వ తేదీ శుక్రవారం అఖండ అన్న సమారాధన నిర్వహిస్తామన్నారు.
లేడీ సూపర్ స్టార్ నయనతార చెన్నైలోని ప్రతిష్టాత్మక ‘పోయెస్ గార్డెన్’లో రూ.31.5 కోట్లతో ఒక భారీ లగ్జరీ డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది. 14,369 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ నివాసం ‘లెగసీ’ అనే ప్రీమియం కాంప్లెక్స్‌లో ఉంది. ఇప్పటికే HYDలోని బంజారా హిల్స్‌లో ఆమెకు రెండు విల్లాలు ఉండగా, ఇప్పుడు ఈ కొత్త ఇల్లు ఆమె ఆస్తుల జాబితాలో చేరింది.
KNR: శంకరపట్నం మండలం కల్వల ప్రాజెక్ట్ ఆధునీకరణకు మంత్రులు ప్రత్యేక చొరవ చూపాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోరారు. వీణవంకలో రహదారి నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. కరీంనగర్ డంప్యార్డును హుజూరాబాద్ నియోజవర్గానికి తరలిస్తారని ప్రచారం జరుగుతోందని, దానికి తాము ఒప్పుకోబోమన్నారు.
NLG: ములపల్లిలోని సాగర్ ఎడమ కాలువలో మిర్యాలగూడ పట్టణం ముత్తిరెడ్డికుంటకు చెందిన మర్రి రవి గల్లంతయ్యారు. అతని స్నేహితులు జలాల్, సతీశ్‌తో కలిసి సరదాగా ఈతకు కొట్టేందుకు వెళ్లాడు. ఈత కొట్టే కొడుతుండగా నీటి ప్రవాహానికి అధికంగా రావడంతో రవి నీటిలో మునిగిపోవడంతో గల్లంతయ్యాడు. దీంతో స్నేహితులు అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
KRNL: టెన్త్ హాల్ టికెట్లను విద్యార్థులు వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని శుక్రవారం డీఈవో సుధాకర్ తెలిపారు. ఈనెల 16 నుంచి పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో, ‘మనమిత్ర’ 9552300009 ద్వారా విద్యార్థుల సౌలభ్యం కోసం ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చిందని పేర్కొన్నారు. సాంకేతికతను ఉపయోగించుకుని హాల్ టికెట్లు సులభంగా పొందేలా ఏర్పాట్లు చేశామన్నారు.
AP: పరామర్శల పేరుతో జగన్ బలప్రదర్శన చేస్తున్నారని, అంబులెన్సులకూ దారి ఇవ్వట్లేదని CM చంద్రబాబు విమర్శించారు. తమ టైర్ల కింద మనుషుల్ని తొక్కించేసి.. ప్రభుత్వంపై నెడుతున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆయనకు తెలిసింది విధ్వంసమేనని దుయ్యబట్టారు. రప్పా రప్పా అంటూ కటౌట్లకు రక్తాభిషేకం చేయించడం ద్వారా హింసను ప్రేరేపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
VKB: దోమ మండల పరిధిలోని మోత్కూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం స్టేజ్ నిర్మించాలని కోరుతూ సర్పంచ్ ఆనంద్‌కు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాండు నిన్న వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల ప్రతిభను చాటేందుకు పాఠశాల ఆవరణలో వేదిక అవసరమని ఈ సందర్భంగా వివరించారు.
HYD: సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల అభ్యర్థులు సత్తా చాటారు. రాష్ట్రం నుంచి ఎంపికైన మొత్తం 20 మందిలో 8 మంది మన జిల్లాలకు చెందిన వారే కావడం విశేషం. లక్ష్మీ రచన 178వ ర్యాంక్, మెరుగు కౌశిక్ 399, ప్రీతీ రాపర్తి 468, విక్రమ్ సింహా రెడ్డి 682, విజయ్ సింహా రెడ్డి 682, శ్రీరామ్ హర్ష 823, ప్రత్యూష 908, దీపక్ శర్మ 951 ఉత్తమ ర్యాంకులు సాధించారు.
కడప: ఉక్కాయపల్లెలోని ఎకో పార్క్ అభివృద్ధి కోసం మార్చి 8న ఉదయం 6 గంటలకు ‘క్లీన్ కడప-బయో డైవర్సిటీ’ పేరుతో భారీ కార్యక్రమం నిర్వహించనున్నారు. శుక్రవారం మేయర్ సురేష్ కుమార్, కమిషనర్ రాకేష్ చంద్ర ఈ కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, నగర ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేయర్ సురేష్ కుమార్ పేర్కొన్నారు.