• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

SMAM పథకంలో రైతు పరికరాల పంపిణీ

NRPT: మరికల్ రైతు వేదికలో SMAM పథకం కింద మంజూరైన పవర్ స్ప్రేయర్లు, కల్టివేటర్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మరికల్ మండలానికి 5, ధన్వాడకు 10 స్ప్రేయర్లు అందజేశారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ సదాశివరెడ్డి రైతులకు అవసరమైన యంత్రాలను సబ్సిడీతో అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో రహమాన్ ఖాన్, నాయకులు పాల్గొన్నారు.

March 7, 2026 / 08:11 AM IST

VIDEO: విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి: ఎమ్మెల్యే

MBNR: జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే ఇప్పటి నుంచే స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని కృషి చేయాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలో ముడా నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్‌ను హైమాస్ట్ విద్యుత్ దీపాలను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

March 7, 2026 / 08:11 AM IST

శివుడిని వివాహం చేసుకున్న అర్ధనారీశ్వరులు

SRCL: వేములవాడలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవంతో భక్తజన సంద్రమైంది. ప్రతి ఆలయంలో శివరాత్రి రోజున శివ కళ్యాణాలు నిర్వహించడం జరుగుతుంది. కానీ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో కామ దహనం అనంతరం పార్వతి రాజరాజేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇసుక చల్లితే రాలనంత జనంతో కిటకిటలాడుతుంది.

March 7, 2026 / 08:08 AM IST

SSC పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

NRML: జిల్లాలో SSC పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో భోజన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 14 నుంచి ప్రారంభంకానున్న పరీక్షలకు జిల్లాలో 9750 మంది విద్యార్థులు హాజరవుతున్నారని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

March 7, 2026 / 08:06 AM IST

భారీ జీతంతో NIPER ఉద్యోగాలు.. అప్లై చేశారా?

NIPERలో 2 అసిస్టెంట్ ప్రొఫెసర్, 1 మెడికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. PhD, MBBS, M.Pharm, BTech, MTechలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల 40 ఏళ్ల లోపువారు అప్లై చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు రూ.1000. SC/ST/PwBDలకు ఫీజుల లేదు. అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రూ.78,000.. ఆఫీసర్‌కు రూ.56,100 జీతం చెల్లిస్తారు. పూర్తి వివరాల కోసం సైట్: www.niper.gov.in

March 7, 2026 / 08:06 AM IST

‘మహిళా సాధికారతకు ‘మిషన్ శక్తి’ దోహదం’

SRD: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మిషన్ శక్తి’ పథకం మహిళా సాధికారతకు ఎంతో దోహదపడుతుందని సంగారెడ్డి జిల్లా సంక్షేమ అధికారి పేర్కొన్నారు. శుక్రవారం సంగారెడ్డిలో నిర్వహించిన సర్పంచుల శిక్షణా శిబిరంలో ఆమె మాట్లాడారు. ‘బేఠీ బచావో-బేఠీ పడావో’ ద్వారా బాలికల విద్య, రక్షణ, లింగ నిర్ధారణ పరీక్షల నివారణే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు.

March 7, 2026 / 08:03 AM IST

ఐదుగురు జూదరుల అరెస్టు

NLG: పేకాట స్థావరంపై దాడిచేసిన పోలీసులు ఐదుగురు జూదరులను అరెస్టు చేశారు. వన్ టౌన్ సీఐ నాగభూషణం తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడం పట్టణంలోని హౌజింగ్ బోర్డు కాలనీలో శుక్రవారం రాత్రి కొందరు పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచరం మేరకు తనిఖీలు చేయగా.. ఇస్మాయిల్, శ్రీధర్, నాగేందర్, నాగేందర్, అంజయ్యను పట్టుకున్నట్లు తెలిపారు.

March 7, 2026 / 08:03 AM IST

‘పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం’

PDPL: పర్యావరణ పరిరక్షణకు అందరం కలిసి కృషి చేద్దామని రామగుండం ఎమ్మెల్యే ఠాగూర్ మక్కాన్ సింగ్ పిలుపునిచ్చారు. పొల్యూషన్‌ను నివారించి పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. రామగుండం సింగరేణి ప్రాంతం బొగ్గు గనులు NTPCకు భారతదేశంలోనే ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలిపారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుందన్నారు.

March 7, 2026 / 08:02 AM IST

కొనసాగుతున్న మహిళా క్రీడా పోటీలు

BHNG: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో రెండో రోజు శుక్రవారం మహిళా క్రీడా పోటీలు కొనసాగినట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి కె ధనంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా టీజేఏసీ అధ్వర్యంలో స్పీడ్ వాక్, టెన్నికాయిట్ సింగిల్, క్యారమ్స్, స్పీడ్ వాక్ నిర్వహించినట్లు తెలిపారు.

March 7, 2026 / 08:02 AM IST

జిల్లాలో రూ.126.71 కోట్లు ఇంటి పన్ను బకాయిలు: కలెక్టర్

E.G: జిల్లాలోని గ్రామాల్లో ఇంటి పన్నులు, ఇతర పన్నులు సకాలంలో చెల్లించి గ్రామ పంచాయితీలకు సహకరించాలని కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. జిల్లాలోని 342 గ్రామ పంచాయితీలలో 2025-26 సంవత్సరానికి సంబంధించిన ఇంటి పన్నులు, ఇతర పన్నులు, గత సంవత్సరాల బకాయిలతో కలిపి మొత్తం రూ.126.71 కోట్లు వసూలు చేయాల్సి ఉందన్నారు.

March 7, 2026 / 08:00 AM IST

గంజాయి పట్టివేత…. ఇద్దరిపై కేసు నమోదు

JGL: వెల్గటూర్ మండలం జగదేవపేట శివారులో గంజాయి పట్టుబడింది. ఎస్సై పి.ఉదయ్ కుమార్ పోలీస్ సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా కొండాపూర్ గ్రామానికి చెందిన వెంకటేశ్, కళ్యాణ్‌ నిషేధిత గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. వారి నుంచి 60 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు.

March 7, 2026 / 08:00 AM IST

బాధిత కుటుంబానికి LOC అందజేత

BHPL: అంబట్పల్లి గ్రామానికి చెందిన పుట్ట మధునక్క అనే మహిళ అనారోగ్యానికి గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స నిమిత్తం డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని స్థానిక నేతలు, IT మంత్రి శ్రీధర్ బాబుకు తెలియజేశారు. వెంటనే స్పందించిన మంత్రి CMRF నుంచి రూ.2.50 లక్షల LOC మంజూరు చేయించారు. ఇవాళ మంత్రి PRO బాధిత కుటుంబానికి LOCని అందజేశారు.

March 7, 2026 / 08:00 AM IST

పరశురామేశ్వరస్వామి ఆలయంలో రేపటి నుంచి బాలాలయం

TPT: దేశంలో మొట్టమొదటి శివాలయంగా గుర్తింపు పొందిన ఏరేడు మండలంలోని గుడిమల్లం శ్రీ పరశురామేశ్వరస్వామి ఆలయంలో ఏప్రిల్ 18 నుంచి 23 వరకు మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి బాలాలయం చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

March 7, 2026 / 08:00 AM IST

విదుర నీతి: ఈ ఒక్కదాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి

మనిషి తన జీవితంలో డబ్బు కంటే తన ‘శీలాన్ని’ (క్యారెక్టర్) జాగ్రత్తగా కాపాడుకోవాలని విదురుడు బోధించారు. ధనం ఈరోజు వస్తుంది, రేపు పోతుంది.. పోయిన డబ్బును మళ్లీ కష్టపడి సంపాదించుకోవచ్చు. కానీ ఒకసారి చేజారిన నడవడిక, పోయిన పరువు మళ్లీ తిరిగి రావు. డబ్బు లేనివాడు ఎప్పటికీ పేదవాడు కాదు, కానీ వ్యక్తిత్వాన్ని కోల్పోయినవాడు జీవితంలో సర్వస్వం కోల్పోయినట్టే లెక్క అని విదురుడు చెప్పారు.

March 7, 2026 / 08:00 AM IST

సివిల్స్‌లో సత్తా చాటిన ఎంపీడీవో

WNP: ఖిల్లా ఘనపూర్ ఎంపీడీవో విజయసింహారెడ్డి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఫలితాల్లో 682వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. 2025లో ప్రభుత్వ సర్వీసులో చేరిన ఆయన, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీగా సమర్థవంతంగా పనిచేశారు. విధి నిర్వహణలో ఉంటూనే సివిల్స్‌లో ర్యాంకు సాధించడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

March 7, 2026 / 07:56 AM IST