WNP: ఖిల్లా ఘనపూర్ ఎంపీడీవో విజయసింహారెడ్డి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఫలితాల్లో 682వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. 2025లో ప్రభుత్వ సర్వీసులో చేరిన ఆయన, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీగా సమర్థవంతంగా పనిచేశారు. విధి నిర్వహణలో ఉంటూనే సివిల్స్‌లో ర్యాంకు సాధించడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.