• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి: JC

ప్రకాశం: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని 8వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 3000 మందితో మహిళా దినోత్సవ వేడుకలను జరుపుతున్నామన్నారు. దానికి అనుగుణంగా మెప్మా, ఐసీడీఎస్ శాఖల సిబ్బందితో సమన్వయం చేసుకోవాలన్నారు.

March 7, 2026 / 06:15 AM IST

‘కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి కట్టుబడి ఉంది’

MNCL: కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి కట్టుబడి ఉందని మంత్రి వివేక్ అన్నారు. చెన్నూరులోని మైనార్టీ ఫంక్షన్ హాల్‌లో రూ.50 లక్షల నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఆ అల్లాహ్ ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని కోరారు.

March 7, 2026 / 06:14 AM IST

నర్శింగ్ , పారా మెడికల్ పోస్టులు భర్తీ చేయాలి: MLC

VZM: ఎస్.కోట ఏరియా ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న నర్శింగ్, పారా మెడికల్ పోస్టులు భర్తీ చేయాలని MLC ఇందుకూరి రఘురాజు శాసన మండలిలో శుక్రవారం డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ చికిత్స అందేందుకు ట్రామా సెంటర్‌ ఏర్పాటు చేయాలని కోరారు. కార్దియాక్‌, న్యూరో, ఆర్థో విభాగాల్లో స్పెషలిస్ట్‌ డాక్టర్లను నియమించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

March 7, 2026 / 06:14 AM IST

నేడు ఉచిత మధుమేహ శిబిరం

KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం సమీపంలోని సుజేంద్ర ఆరోగ్య‌శాలలో ఉచిత మధుమేహ శిబిరాన్ని పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామీజీ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు శుక్రవారం మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు తెలిపారు. ఇవాళ బెంగళూరుకు చెందిన సమత్వం టీం వైద్యం అందిస్తారని పేర్కొన్నారు. మధుమేహ పరీక్షలు, మందులు ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.

March 7, 2026 / 06:13 AM IST

పన్ను బాకీ.. లాడ్జికి రెడ్ నోటీసు జారీ

HYD: రెజిమెంటల్ బజార్‌లో దీర్ఘకాలికంగా ఆస్తి పన్ను చెల్లించని లాడ్జిలపై GHMC అధికారులు కొరడా ఝుళిపించారు. న్యూ పంచవతీ లాడ్జి గత మూడేళ్లుగా రూ. 3 లక్షలకు పైగా బకాయి ఉండటంతో అధికారులు ‘రెడ్ నోటీసు’ జారీ చేశారు. పన్ను చెల్లింపుపై పలుమార్లు హెచ్చరించినా స్పందన లేకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. బకాయిలు చెల్లించేందుకు ఏడు రోజుల గడువు ఇచ్చామన్నారు.

March 7, 2026 / 06:13 AM IST

అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

కృష్ణా జిల్లాలోని బందరు, బంటుమిల్లి, పామర్రు, గుడివాడ, కంకిపాడు, మొవ్వ, గన్నవరం, అవనిగడ్డ ప్రాజెక్టులలో మొత్తం 82 అంగన్వాడీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ICDS PD M.N రాణి తెలిపారు. 21–35 ఏళ్ల మధ్య వయస్సు కలిగి 10వ తరగతి ఉత్తీర్ణులైన వివాహిత మహిళలు ఈ నెల 17లోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాలకు సంబంధిత ICDS కార్యాలయాలను సంప్రదించాలని చెప్పారు.

March 7, 2026 / 06:12 AM IST

ఆపేసిన పనులను తిరిగి ప్రారంభిస్తాం: మంత్రి

NDL: గత ప్రభుత్వంలో రహదారుల మరమ్మతు చేయలేదని శుక్రవారం మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శించారు. మంజూరైన పనులు కూడా గత ప్రభుత్వం రద్దుచేసిందన్నారు. మండపేట నియోజకవర్గంలో రోడ్ల మరమ్మతు కోసం రూ. 20 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. మండపేట బైపాస్ విషయం కూడా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. గతంలో ఆపేసిన పనులు తిరిగి ప్రారంభిస్తామని మంత్రి పేర్కొన్నారు.

March 7, 2026 / 06:09 AM IST

‘సకాలంలో ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయాలి’

SKLM: తపట్నంలోని రైతులకు సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా తామర ఎత్తిపోతల పథకం నిలుస్తుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శుక్రవారం ఈ ఎత్తిపోతల పథకం పనులను కలెక్టర్ పరిశీలించారు. సకాలంలో పనులు నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.11 గ్రామాల్లోని 3,850 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

March 7, 2026 / 06:09 AM IST

రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు గురుకుల విద్యార్థులు

ASF: ఆసిఫాబాద్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలకు చెందిన హర్షిత్, రాష్ట్రపాల్, సంకేత్, కృష్ణ, ఆదర్శ్ రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ అబ్దుల్ రహీం తెలిపారు. ఈ నెల 7 నుంచి 9 వరకు మహబూబాబాద్ జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో వారు పాల్గొననున్నారు. ఎంపికైన విద్యార్ధులను ఉపాధ్యాయులు అభినందించారు.

March 7, 2026 / 06:09 AM IST

కక్షలు వీడి ఆత్మీయంగా జీవిద్దాం: సీ.ఐ

KDP: పెండ్లిమర్రి మండలం పాత సంగటిపల్లిలో శుక్రవారం రాత్రి పోలీసు కళా-జాగృతి బృందం ‘మేలుకొలుపు’ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా సి.ఐ చల్లని దొర మాట్లాడుతూ.. కక్షలకు దూరంగా ఉంటూ, పిల్లల భవిష్యత్తుకు బాటలు వేయాలని పిలుపునిచ్చారు. సైబర్ నేరాలు, పోక్సో, బాల్య వివాహాలు, రహదారి భద్రత వంటి అంశాలపై నాటకాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.

March 7, 2026 / 06:08 AM IST

నేడు రైతు వేదికలో మెగా వైద్య శిబిరం: డా. ఆచార్య

WGL: నల్లబెల్లి(M) కేంద్రంలోని ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా రైతు వేదికలో శనివారం మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు మండల వైద్యాధికారి డా. ఆచార్య తెలిపారు. ఈ శిబిరంలో గైనకాలజీ, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్, డెంటల్, జనరల్ మెడిసిన్ విభాగాలకు చెందిన ప్రముఖ వైద్యులు పాల్గొంటున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

March 7, 2026 / 06:08 AM IST

అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం

అన్నమయ్య: మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో అగ్నిమాపక అధికారి శివప్ప ఆధ్వర్యంలో శుక్రవారం అగ్ని ప్రమాదాలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవిలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంటలను యంత్రాల సహాయంతో ఎలా ఆర్పాలనే దానిపై డెమో ద్వారా వివరించారు. విద్యుత్ పరికరాల వాడకంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు.

March 7, 2026 / 06:06 AM IST

మాజీ సైనికుల సంక్షేమంపై కలెక్టర్ కీలక ఆదేశాలు

VSP: జిల్లాలో జరిగిన సైనిక్ బోర్డు సమావేశంలో కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ మాజీ సైనికుల సంక్షేమంపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆనందపురంలో కేటాయించాల్సిన గృహ స్థలాల ప్రక్రియను వేగవంతం చేయాలని, సైనిక్ భవన్ నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూర్చాలని అధికారులకు సూచించారు. పెన్షన్, వైద్య సౌకర్యాలను సమన్వయంతో వేగంగా అందించాలని ఆయన ఆదేశించారు.

March 7, 2026 / 06:06 AM IST

‘న‌కిలీ మందులు అమ్మితే చ‌ర్య‌లు త‌ప్ప‌వు’

SRPT: నకిలీ మందులు అమ్మిన మెడికల్ షాపులపై కఠిన చర్యలు తప్పవని డ్రగ్ ఇన్‌స్పెక్ట‌ర్ సురేందర్ హెచ్చరించారు. మెడికల్ షాపులో నకిలీ మందులు, ప్రభుత్వం నిషేధించిన చిన్నపిల్లల దగ్గు టానిక్స్ విక్రయిస్తున్నారని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు శుక్రవారం గరిడేపల్లి మండల పరిధిలోని పొనుగోడు గ్రామంలోనీ శ్రీ రామ మెడికల్ షాప్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

March 7, 2026 / 06:04 AM IST

‘మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి’

NZB: మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, సీఐజీ గ్రూపులను యథావిధిగా కొనసాగించాలని, ఏజెన్సీ కార్మికులతో కొత్త గ్రూపులు ఏర్పాటు చేయాలని AITUC, TUCI, సీఐటీయూ సంఘల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు NZB మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు.

March 7, 2026 / 06:02 AM IST