SRPT: నకిలీ మందులు అమ్మిన మెడికల్ షాపులపై కఠిన చర్యలు తప్పవని డ్రగ్ ఇన్స్పెక్టర్ సురేందర్ హెచ్చరించారు. మెడికల్ షాపులో నకిలీ మందులు, ప్రభుత్వం నిషేధించిన చిన్నపిల్లల దగ్గు టానిక్స్ విక్రయిస్తున్నారని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు శుక్రవారం గరిడేపల్లి మండల పరిధిలోని పొనుగోడు గ్రామంలోనీ శ్రీ రామ మెడికల్ షాప్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.