MLG: జిల్లా కేంద్రంలో మేడారం సమ్మక్క-సారలమ్మల మహా జాతర సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కోట్లు వెచ్చించి నిర్మించిన రహదారులు రెండు నెలలకే పాడైపోతున్నాయి. దీంతో ప్రజలు తీవ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా పనులు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తక్షణమే రోడ్లు మరమ్మతు చేయాలని కోరుతున్నారు.