KMM: అంగన్వాడీ కేంద్రాల పనితీరు మరింత మెరుగుపడాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంగన్వాడీల పని తీరుపై జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంబంధిత అధికారులతో సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రానికి కేవలం 36 శాతం మంది పిల్లలు మాత్రమే 21 రోజుల కంటే ఎక్కువగా వస్తున్నారని అన్నారు.