TG: KCR తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని CM రేవంత్ అన్నారు. ‘మాకు వ్యక్తిగతంగా సమస్యలు లేవు. కేసీఆర్ కుటుంబమే పదవుల కోసం పాకులాడుతోంది. జగన్, చంద్రబాబు, రేవంత్ జైలుకి వెళ్తే సీఎం అయ్యారని కవిత జైలుకు వెళ్లినందుకు తానే సీఎం అవుతాననుకుంటుంది. మరోవైపు NTR అల్లుడు సీఎం అయ్యాడని.. ఇక్కడ హరీష్ రావు సీఎం అవుతా అంటున్నారు. వారసత్వ రాజకీయాల కోసం KTR పోటీపడుతున్నారు’ అని అన్నారు.