IPL- 2026 సీజన్‌కు ముందు CSK జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. గాయం కారణంగా టోర్నీకి దూరమైన ఆస్ట్రేలియా పేసర్ నాథన్ ఎల్లిస్ స్థానంలో, మరో ఆసీస్ ఫాస్ట్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్‌ను జట్టులోకి తీసుకుంది. ఇందుకోసం అతడితో రూ.1.5 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. అతడు గతంలో గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.