ADB: ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న మహిళ బిరుదుల మౌనికపై నార్నూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు CI ప్రసాద్ మంగళవారం తెలియజేశారు. అంగన్వాడీ ఉద్యోగం పేరుతో రాజులగూడ గ్రామానికి చెందిన మోహిత వద్ద రూ. 60వేలు మహిళ వసూలు చేసినట్లు వెల్లడించారు. బాధితులు ఎవరైనా నిర్భయంగా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించవచ్చని CI ప్రసాద్ సూచించారు.