KDP: పెద్దముడియం పోలీస్ స్టేషన్ పరిధిలోని నెమళ్ళదిన్నె గ్రామంలో పోలీస్ కళాజాగృతి బృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు ఫ్యాక్షన్, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్ధాలు, సైబర్ నేరాలపై ప్రజలకు వివరించారు. ‘ఫ్యాక్షన్ విడిచి ప్రశాంతంగా జీవించండి’ అని పోలీసులు గ్రామస్థులకు పిలుపునిచ్చారు.