ప్రకాశం: దర్శిలో శుక్రవారం సీఎం సహాయ నిధి చెక్కును టీడీపీ ఇంఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి లబ్ధిదారుడికి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పట్టణానికి చెందిన యనమల శ్రీను అనారోగ్య రీత్యా బాధపడుతున్న విషయం తన దృష్టికి రాగా.. రూ.1,61,355ల ఎల్వోసీ చెక్కును బాధితుడికి అందజేసినట్లు తెలిపారు. ఇదే విధంగా పార్టీ అభిమానులకు ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలన్నారు.
VZM: మహారాజా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉమెన్ ఎంపవర్‌మెంట్ అండ్ జెండర్ సెన్సిటైజేషన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ‘గివ్ టు గైన్’ కార్యక్రమానికి అదనపు ఎస్పీ సౌమ్యలత ముఖ్యఅతిథిగా విచ్చేశారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని, సమాన అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
VSP: భూ సేకరణ, భూ సమీకరణలో తీసుకునే భూములకు ఒకే విధంగా పరిహారం చెల్లించేలా ప్రభుత్వం ఏకీకృత విధానం రూపొందించాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సూచించారు. శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని అన్ని గ్రామాల్లో ఒకే రకమైన రిజిస్ట్రార్ మార్కెట్ ధర నిర్ణయించాలని అన్నారు.
NLR: మహిళల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 9న నెల్లూరు జడ్పీ మీటింగ్ హాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ‘మహిళా జన సున్వాయి’ కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ ఆధ్వర్యంలో జరిగే ఈ డ్రైవ్లో జిల్లా అధికారులు, పోలీసులు పాల్గొంటారన్నారు. గృహ హింస, వేధింపులపై వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరిస్తారని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు.
NZB: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి జిల్లాలో PG, ఇంటిగ్రేటెడ్ PG మొదటి సెమిస్టర్, IMBA 7వ సెమిస్టర్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 1,292 మంది విద్యార్థులకు గాను 1,220 మంది హాజరు కాగా, 72 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు.
MDK: తూప్రాన్ మండలం నాగులపల్లి వద్ద అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ సీజ్ చేసినట్లు ఎస్సై గంగరాజు తెలిపారు. నాగులపల్లి గ్రామానికి చెందిన ఏశబోయిన రాములు అనుమతులు లేకుండా ట్రాక్టర్లో ఇసుకను రవాణా చేస్తుండగా వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం వద్ద పట్టుకున్నట్లు వివరించారు. ట్రాక్టర్ సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు వివరించారు.
ఉల్లిపాయలో విటమిన్ ‘సి’ , ‘బి’ వంటి విటమిన్లు, పొటాషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. కాబట్టి ఉల్లిపాయ రసం తాగడం వల్ల ఈ పోషకాలు అందుతాయి. విటమిన్ ‘సి’ ఉన్న ఉల్లిపాయ రసం తాగడం కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు ఉల్లిలో ఉండే సల్ఫర్, ఇతర యాంటీఆక్సిడెంట్లు కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస...
ATP: జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం బాల్య వివాహాల నిర్మూలనపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. దిశా సమావేశం ముగిసిన అనంతరం రెడ్స్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘బాల్య వివాహ విముక్తి రథం’పై MP లక్ష్మీనారాయణ, కలెక్టర్ ఆనంద్ సంతకాలు చేశారు. బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టి, ఆడపిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని అధికారులకు సూచించారు.
ASR: అంతర్జాతీయ మహిళ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్లో శనివారం ఎస్సై సురేష్ అధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డుంబ్రిగుడ కేజీబీవీ పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ మేరకు విద్యార్థులకు పోలీసుల విధులు, వారు వాడే ఆయుధ పరికరాల గురించి వివరించారు.
అన్నమయ్య: రాజంపేట నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల సమీక్షా సమావేశం జరిగింది. నియోజకవర్గ ఇన్‌చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు పార్టీ బలోపేతంపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సమావేశంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
MBNR: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అధికారులకు సూచించారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలోభాగంగా ప్రభుత్వాసుపత్రి వద్ద నిర్వహించిన స్వచ్ఛత కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..99రోజుల కార్యక్రమంలో నిర్వహించే ప్రతి అంశాన్ని విజయవంతం చేయాలని కోరారు.
NRML: జిల్లాలోని అన్ని డీడీవోలు తమ పరిధిలో ఉన్న సీపీఎస్ ఉద్యోగుల డెమోగ్రాఫిక్ వివరాలను సరిచూడాలని జిల్లా డీటీవో సరోజ సూచించారు. మొబైల్ నంబర్, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, నామినీ వంటి వివరాలు సరైనవిగా ఉన్నాయో లేదో CRA NSDL Protean సైట్‌లో డీడీవో లాగిన్ ద్వారా పరిశీలించి అవసరమైతే సవరించుకోవాలని శుక్రవారం ప్రకటనలో తెలిపారు.
GNTR: మహిళా సాధికారత సమాజాన్ని మరింత బలపరుస్తుందని ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మహిళలకు నాయకత్వ అవకాశాలు కల్పించినప్పుడే సానుకూల మార్పులు వస్తాయని, ప్రతి మహిళకు హక్కులు, న్యాయం అందాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
E.G: గోకవరం మండలం మల్లవరంలో ఉద్యాన శాఖ జీడి మామిడి రైతులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జీడి మామిడి పిక్క మొక్క కంటే అంటు మొక్క మేలని శాస్త్రవేత్త డాక్టర్ ప్రవీణ్ వివరించారు. నీరు సదుపాయం ఉన్న రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు కలుపు గొప్పు చేసే యంత్రాలను ఉచితంగా 100 శాతం సబ్సిడీపై అందించడం జరుగుతుందన్నారు.
TG: రంగారెడ్డి జిల్లాలో కొత్వాల్ గూడా ఎకో పార్కును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కొత్వాల్ గూడా ఎకో పార్కును రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. బుద్వేల్ వద్ద ఔటర్‌కు అనుసంధానంగా ట్రంపెట్‌కు శంకుస్థాపన చేశారు.