SDPT: వర్గల్ మండలం నాచారం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మత్తుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు నాచారం, అనంతగిరిపల్లి, వేలూరు, సీతారాం పల్లి, నర్సంపల్లి, మాదారం పరిధిలో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు వివరించారు. ప్రజలు సహకరించాలని కోరారు.
NLG: మున్సిపాలిటీ పరిధిలోని 6, 3, 9వ వార్డుల్లో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు కొత్త బోర్లను శుక్రవారం మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాసులు ప్రారంభించారు. వేసవి కాలంలో ప్రజలకు నీటి కష్టాలు రాకుండా వీటిని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ దశరథ, కమిషనర్ ఎల్. మల్లేశం కలిసి ఈ బోర్లను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
BHPL: మహాదేవపూర్ మండలంలో మసీదుల నిర్మాణం, మైనార్టీ సంక్షేమ అభివృద్ధి కోసం రూ.1.40 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు స్థానిక మైనార్టీ సమాజం హర్షం వ్యక్తం చేసింది. శుక్రవారం మండల కేంద్రంలో IT శాఖ మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి సర్పంచ్ హసీనాబాను అక్బర్ ఖాన్, మైనార్టీ నాయకులు ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
NRPT: మరికల్ మండల కేంద్రంలోని సరస్వతి దేవి దేవాలయంలో శుక్రవారం రాత్రి వైభవంగా కుంకుమార్చన నిర్వహించారు. అర్చకులు శివప్రసాద్ మంత్రోచ్ఛారణలతో కుంకుమార్చన నిర్వహించారు. పసుపు కుంకుమలతో మహిళలు కలకాలం వర్ధిల్లాలని, సుమాంగలీగా ఉండాలని ప్రతి శుక్రవారం కుంకుమార్చన నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.
సత్యసాయి: పెనుకొండలో ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జూనియర్ కళాశాల మైదానంలో సాయంత్రం 4 గంటలకు మహిళలతో భారీ సమావేశం నిర్వహించనున్నట్లు ఎన్డీయే కూటమి నాయకులు తెలిపారు. శుక్రవారం టీడీపీ కన్వీనర్ శ్రీరాములు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరుకానున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.
MNCL: ఉద్యోగులు రక్షణ చర్యలు పాటిస్తూ వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధించాలని శ్రీరాంపూర్ ఏరియా జీఎం శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆర్కే 5 గని ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. కార్మికులు సమన్వయంతో కృషి చేసి నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. అనంతరం గత నెలలో అత్యధిక టబ్బులు నింపిన ఎస్డీఎల్ ఆపరేటర్లకు బహుమతులు అందజేశారు.
TG: హైదరాబాద్‌లో సౌభాగ్య ఇస్పాత్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రూ. 26.86 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. మనీ లాండరింగ్ చట్టం కింద ఫ్లాట్లు, ఖాళీ స్థలాలను అధికారులు జప్తు చేశారు. బ్యాంకును మోసం చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. నకిలీ స్టాక్ స్టేట్ మెంట్లు, ఫోర్జరీ డాక్యుమెంట్లతో రూ. కోట్ల రుణాలు పొందినట్లు గుర్తించారు.
ASR: ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి లక్షల రూపాయలు వసూలు చేసి తమను మోసం చేశారని సంతవలసకు చెందిన రాందాస్ తెలిపారు. మండల వైసీపీ అధ్యక్షుడు తమ దగ్గర నుంచి ఐటీడీఏ పరిధిలో టెక్నికల్ అసిస్టెంట్, బ్యాంకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు చూపించి నకిలీ నియామక పత్రాలు ఇచ్చారన్నారు. దీంతో స్థానిక పోలీసులను ఆశ్రయించినట్లు పేర్కొన్నారు.
AP: హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏప్రిల్‌లో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా లీసా గిల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. పంజాబ్, హర్యానా నుంచి లీసా హైకోర్టుకు ఎంపికయ్యారు.
VSP: వైసీపీ విజయనగరం జిల్లా చీపురుపల్లి పరిశీలకురాలిగా విశాఖ మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారిని నియమించారు. ఈ మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆమె పార్టీ అధ్యక్షుడు జగన్, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణకు కృతఙ్ఞతలు తెలిపారు.
కడప: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో మైదుకూరులో శుక్రవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాలో నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేళాలో పలు కంపెనీలు పాల్గొనగా సుమారు 205 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. వీరిలో 125 మందిని వివిధ కంపెనీలు ఎంపిక చేశాయి.
VKB: జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన దీపక్ తివారి రంగారెడ్డి ఐడీఓసీకి చేరుకున్న ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిసింది. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దీపక్ తివారి మొదటిసారిగా మంత్రిని కలిశారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ దంత వైద్య నిపుణులు, ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ హరి విక్రము శాలువాతో సన్మానించారు. డాక్టర్ హరి విక్రమ్ మాట్లాడుతూ.. నోటి పరిశుభ్రత లేకపోతే చిగుళ్ల వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు.
ASR: డుంబ్రిగూడ మండలంలోని అడపవలసలో శుక్రవారం గంజాయి నివారణ, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డుంబ్రిగూడ ఎస్సై ఎల్. సురేష్ మాట్లాడుతూ.. గంజాయి సాగు, రవాణా, వినియోగంపై ప్రభుత్వం, పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. గంజాయి నేరాలకు దూరంగా ఉండాలని సూచించారు.
MDK: తూప్రాన్ పట్టణ పరిధి పురాతన రామాలయానికి గ్రానైట్ ఏర్పాటు పనులు మొదలయ్యాయి. తూప్రాన్ మున్సిపల్ ఛైర్ పర్సన్ బొంది రజని రాఘవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆలయం వద్ద శుక్రవారం నుంచి గ్రానైట్ వేసే పనులు ప్రారంభించారు. శ్రీరామనవమి పురస్కరించుకొని ఆలయం వద్ద వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. వార్షికోత్సవాల కోసం మరమత్తు పనులు చేపట్టారు